పాన్ మసాలా బ్రాండ్‌కు అమితాబ్ లీగల్ నోటీసులు..

by Shyam |
Amitabh Bachchan, pan masala
X

దిశ, సినిమా : కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తన ఫొటోతో కూడిన టీవీ వాణిజ్య ప్రకటనల ప్రసారాన్ని కొనసాగిస్తున్న ‘పాన్ మసాలా’ బ్రాండ్‌కు బిగ్ బీ అమితాబ్ తాజాగా లీగల్ నోటీసులు పంపారు. పొగాకు ఉత్పత్తుల పట్ల యువతను ప్రోత్సహించకుండా సాయపడేందుకు ‘పాన్ మసాలా’ బ్రాండ్‌ ప్రమోషన్‌ మానుకోవాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ గతంలో బిగ్ బీని అభ్యర్థించింది. దీంతో తాను ‘కమ్లా పసంద్’ ప్రచారం నుంచి వైదొలుగుతున్నట్లు అక్టోబర్‌లో తెలిపిన బిగ్ బీ.. తీసుకున్న డబ్బును తిరిగిచ్చినట్లు వివరించారు. కానీ సదరు కంపెనీ మాత్రం ఇప్పటికీ ఆ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌‌ను ప్రసారం చేస్తోంది.

ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తంచేసిన అమితాబ్ కార్యాలయం.. ‘పాన్‌ మసాల’ యాడ్ ప్రసారమైన కొన్ని రోజులకే బచ్చన్‌జీ అందులో నుంచి తప్పుకున్నారు. ఒప్పందాన్ని రద్దు చేసుకుని, ప్రమోషన్‌ కోసం తీసుకున్న డబ్బు వాపస్ చేశారు’ అని నోటీసులో పేర్కొంది. కాగా ఈ ప్రకటనలో నటించినందుకు బిగ్ బీ విమర్శలపాలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed