- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థాయ్‌లో సరికొత్తగా ‘ప్లేన్ కేఫ్స్’
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాండమిక్ కారణంగా.. చాలా మంది విమాన ప్రయాణాలను మిస్ అవుతున్నారు. అంతేకాదు దేశవిదేశాలను చుట్టేసిన చాలా విమానాలు సైతం తమ టైమ్ అయిపోవడంతో మూలన(రిటైర్) పడ్డాయి. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ వాసులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అటు విమాన ప్రయాణీకులకు కొత్త అనుభూతినిస్తూనే.. ఇటు రిటైర్ అయిపోయిన విమానాలకు న్యూ లుక్ ఇచ్చేశారు. థాయ్‌లాండ్ ‘ప్లేన్ కేఫ్స్’ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి.
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నది సామెతను వినే ఉంటారు. నిజానికి జిహ్వ చాపల్యం కోసం రకరకాల ఫుడ్ ఆరగిస్తుంటాం. మనసుకు కొత్త రెక్కలు తొడగడానికి.. కొత్త కొత్త ప్లేసెస్, వింతైన రెస్టారెంట్లను వెతుక్కుంటూ వెళ్తుంటాం. ఈ రెండింటినీ కలగలిపి మనసుకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు థాయ్‌లాండ్‌లోని ‘ప్లేన్ కేఫ్స్’ కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. కరోనా వల్ల చాలామటుకు ట్రావెల్ ప్లాన్స్ ఆగిపోయాయి. కాగా, ఎయిర్ ట్రావెల్ అనుభూతితో పాటు ఫైన్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి థాయ్‌లోని కొన్ని విమానాలను ‘ప్లేన్ కేఫ్స్’గా మార్చేశారు. దీంతో థాయ్ వాసులు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఈ కేఫ్‌లకు వస్తున్నారు. అంతేకాదు, ఇక్కడకు వచ్చే కస్టమర్లకు బోర్డింగ్ పాసులు కూడా ఇస్తుండటంతో కాక్‌పీట్‌లోకి కూడా వెళ్లొస్తున్నారు.
ప్లేన్ కేఫ్స్‌లో ఫస్ట్ క్లాస్ సీట్లలో కూర్చుని.. హాయిగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. పనిలో పనిగా.. ఏదో టూర్ వెళుతున్నట్లుగా గ్రూప్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం థాయ్‌లో రెండు విమానాలు ఇలాంటి సర్వీస్‌ను అందిస్తున్నాయి. కోస్టల్ సిటీ అయిన పట్టాయాలో ఒకటి, బ్యాంకాక్‌లో మరొక ‘ప్లేన్ కేఫ్’ ఉంది. ఇందులో పనిచేసే హోటల్ క్రూ కూడా ఎయిర్ హోస్టెస్‌లా తయారై, వారికి నిజమైన ఎయిర్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు.
ఇండియాలో అయితే పంబాబ్‌లోని నేషనల్ హైవే 1, అంబాలా-కురుక్షేత్ర రోడ్‌లో ఇలాంటి ప్లేన్ కేఫ్ ఉంది. దాని పేరు ‘రన్‌వే1’. ఎయిర్ బస్ ఏ320ను రెస్టారెంట్‌గా మార్చారు. వ్యాపారవేత్త పరమ్‌ప్రీత్ సింగ్ లుథ్రా దీన్ని ప్రారంభించాడు. అన్ని అనుమతులు పొంది రెస్టారెంట్ ప్రారంభించడానికి అతనికి ఏడాది పట్టింది. పూర్తి శాకాహారం వడ్డించే 72 సీట్లు ఉన్నాయి. కేఫ్, బేకరీతో పాటు 40 మంది పట్టే కిట్టీ హాలు కూడా ఉంది.
Read Also…