బలహీన వర్గాల అభివృద్ధే..రాజ్యాంగానికి నిజమైన గౌరవం

by Shyam |
బలహీన వర్గాల అభివృద్ధే..రాజ్యాంగానికి నిజమైన గౌరవం
X

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్129వ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి తన అధికారిక నివాసంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ,అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ,పీడిత ప్రజల బాగు కోసం, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ అడుగుజాడలో మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.

Tags: Ambedkar Jayanti, Celebration, weaker Section development, tribute, minister vemula

Advertisement

Next Story

Most Viewed