- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిలయన్స్‌కు అమెజాన్ కౌంటర్… ఏంటో తెలుసా!
దిశ, వెబ్‌డెస్క్: రిటైల్ రంగంలో సరికొత్త వార్ మొదలైంది. ఇప్పటివరకూ టెలికాం రంగంలో ఇలాంటి వార్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టడంతో ఈ-కామర్స్ సంస్థలతో పోటీకి రిలయన్స్ సంస్థ సిద్ధమైంది. ఇదివరకు రిలయన్స్ వ్యూహాల్ని గమనించిన ఇతర సంస్థలు కూడా కొత్త వ్యూహంతో డిజిటల్ వార్‌కు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తర్వాత తరానికి బలమైన వ్యాపార పునాదులను నిర్మిస్తున్నారు. ఇదివరకు టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రాభవం మొదలవగా, తాజాగా జియో మార్ట్‌తో స్థానిక కిరాణా దుకాణాలను ఆన్‌లైన్ విభాగంలో చేర్చడానికి వాట్సాప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మిగిలిన ఈ-కామర్స్ సంస్థలకు పోటీ మరో స్థాయికి చేరింది. దీన్ని అధిగమించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రత్యర్థుల నుంచి పోటీని తట్టుకునేందుకు స్థానిక రిటైలర్లు, దుకాణాలతో ఆన్‌లైన్ సర్వీసులను లాంచ్ చేసింది. ఇలాంటి సేవలను ప్రపంచంలో ఎక్కడా ప్రారంభించలేదు. ఇది సరికొత్త ఆవిష్కరణ అని నిపుణులు సైతం భావిస్తున్నారు.
లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్..
‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ అనే పేరుతో అమెజాన్ సంస్థ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఆరు నెలల వరకూ కొనసాగుతుంది. ఇండియాలో వందకుపైగా నగరాల్లో 5,000 స్థానిక రిటైలర్ షాపులతో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణాల ద్వారా వినియోగదారులకు సరుకులను అందించనుంది. గత నెలరోజులుగా దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో అత్యవసర వస్తువులే కాకుండా ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతివ్వాలంటూ రిటైలర్ దుకాణాదారులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ఇలాంటి వ్యూహంతో రావడం ఈ-కామర్స్ వర్గాల్లో చర్చనీయాంసంగా మారింది.
అనేక నగరాలు.. అనేక ఉత్పత్తులు
అమెజాన్ అందించే ఈ సదుపాయాన్ని ఉపయోగించి స్థానిక దుకాణాల నుంచి అవసరమైన వాటిని ఎంపిక చేసుకోవడమే కాకుండా తక్కువ సమయంలో వస్తువుల డెలివరీ సాధ్యమవుతుందని అమెజాన్ సంస్థ వెల్లడించింది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, జైపూర్, కోయంబత్తూరు, పూణె, లక్నో, ఫరీదాబాద్, వారణాసి, అహ్మదాబాద్ నగరాల్లోని రిటైలర్లు ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ ద్వారా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ కొత్త పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఫర్నిచర్, ఆటోమోటివ్, దుస్తులు, కిచెన్, బ్యూటీ, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్, బుక్స్, బొమ్మలు వంటి అనేక ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని సంస్థ వివరించింది. స్థానిక దుకాణాల నుంచి వీలైనంత వేగంగా వస్తువులు, ఉత్పత్తులను డెలివరీ చేయడమే కాకుండా, దుకాణాదారులు తన ప్రాంతం పరిధి నుంచి వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశముందని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ టెక్నాలజీ ద్వారా ఇండియాలోని స్థానిక దుకాణాలు సరుకులను ఆన్‌లైన్ ద్వారా అమ్మేందుకు సహాయపడుతుందని, భవిష్యత్తులో మరింత సామర్థ్యంతో దీన్ని ఉపయోగిస్తామని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఖచ్చితమైన డెలివరీ..
భవిష్యత్తులో స్థానికంగా ఉన్న దుకాణాలన్నీ డిజిటల్ స్టోర్‌లుగా మారబోతున్నాయి. దుకాణాలు అమెజాన్ ప్రోగ్రామ్‌లో చేరవచ్చని, అదనంగా ఆదాయాన్ని సంపాదించేందుకు అమెజాన్ సహాయపడుతుందని సంస్థ చెబుతోంది. అమెజాన్ యాప్‌లో ఉన్న ‘ఐ హావ్ స్పేస్’ సదుపాయం ఉపయోగించి డెలివరీ, పికప్ పాయింట్లుగా పనిచేస్తూ అదనంగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని అమెజాన్ ఇండియా సేల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ వెల్లడించారు. ఇవి కాకుండా వాక్-ఇన్ వినియోగదారులకు ‘అమెజాన్ ఈజీ’ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని, ఇది మార్కెట్లో ఆన్‌లైన్ షాపింగ్ పొందేందుకు వీలుగా ఉంటుందని, కొత్త ఆన్‌లైన్ దుకాణదారులకు భాష, ఇంటర్నెట్, డిజిటల్ చెల్లింపులు లావాదేవీల ఇబ్బందులను తొలగించేందుకు సహాయపడుతుందని చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం అమెజాన్ సంస్థ రూ. 10 కోట్ల పెట్టుబడులును పెట్టనుంది. ముఖ్యంగా అమెజాన్ సంస్థ వినియోగదారులకు ఖచ్చితమైన డెలివరీలను చేసేందుకు అన్ని సరుకుల, ఉత్పత్తుల రవాణాను రోజూ ట్రాక్ చేస్తామని స్పష్టం చేసింది.
Tags: Amazon, Amazon Retail Stores, Local Shop O Amazon Programme, Local Shops On Amazon, Amazon News, Reliance Facebook Deal