అమెజాన్ ప్రైమ్..మొబైల్ ఎడిషన్

by Harish |
అమెజాన్ ప్రైమ్..మొబైల్ ఎడిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సింప్లీ ‘ప్రైమ్ వీడియో’ సినిమాలతో పాటు, ఒరిజినల్ కంటెంట్స్‌ అందిస్తూ యావత్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2006లో మొదలైన ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దశాద్దం తర్వాత అనగా..2016లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ఈ డిజిటిల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ప్రైమ్ వీడియో’..దాని పేరులోని ‘ఎమ్‌ఈ’ అక్షరాలను తొలగించి..వేర్ ఈజ్ ఎమ్ఈ ( #WhereIsME) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది. ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దీన్ని ట్రెండ్ చేస్తూ, హిట్ సినిమాల్లోని కొన్ని డైలాగుల్లో ‘ఎమ్‌ఈ’ మిస్ చేసి ఎడిట్ చేసి పోస్టులు షేర్ చేసింది. ఇంతకీ అమెజాన్ ఎందుకిలా చేసింది? ప్రైమ్‌లో ఇక ఆ అక్షరాలు కనిపించవా? ఆ విషయాలు మీ కోసం..

ఎంతోమంది ‘మి(ME)’ మిస్ కావడానికి కారణం ఏంటా? అని ఆలోచిస్తుండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో తమ లోగో మార్పు విషయంలో ‘మి’ మిస్ అవ్వడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మాదిరిగా, ప్రైమ్ కూడా తమ వినియోగదారుల కోసం మొబైల్ ఎడిషన్‌(ఎమ్ఈ) ను ప్రవేశపెట్టింది. ఆ విషయాన్ని ప్రజలకు క్రియేటివ్‌గా చెప్పడానికే ఈ పనిచేసింది. ఇండియాలో మొబైల్ వాడకం అత్యధికం. కాబట్టి వారి కోసమే అమెజాన్ ప్రత్యేకంగా ఈ మొబైల్ ఎడిషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘భారతీయ కస్టమర్లలో ఎక్కువ శాతం మంది మొబైల్ డివైజ్ వాడుతారు. స్ట్రీమింగ్ ఎంగేజ్‌మెంట్‌లో ఇండియా టాప్ పొజిషనల్‌లో ఉంటుంది. అందువల్ల మా కస్టమర్లకు మరింత హై క్వాలిటీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రారంభించాం. ప్రతి భారతీయుడు మా ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ కంటెంట్‌‌ను ఇప్పుడు మరింత నాణ్యతతో వీక్షించొచ్చు’ అని అమెజాన్ ప్రైమ్ వీడీయో సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె.మెరైన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed