చిరంజీవి ఇంటిని ముట్టడించాలని పిలుపివ్వలేదు: అమరావతి జేఏసీ

by srinivas |
చిరంజీవి ఇంటిని ముట్టడించాలని పిలుపివ్వలేదు: అమరావతి జేఏసీ
X

ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి ఇంటిని ముట్టడించాలని తాము పిలుపునివ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు ప్రకటించారు. చిరంజీవి ఇంటిని ముట్టడించాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుందని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం తాము చేస్తున్న ఉద్యమాన్ని బలహీన పర్చేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా పోస్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.

Advertisement

Next Story