- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమలాపాల్.. ఓ లవ్ స్టోరీ!
అమలాపాల్… క్రేజీ హీరోయిన్. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అమలా… భర్త ఎ.ఎల్. విజయ్‌తో విడాకుల తర్వాత ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వివాహ బంధం నుంచి బయటకు వచ్చాక… కెరియర్‌లో స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తమిళ్‌లో రెండు, మూడు సినిమాలు ట్రాక్‌లో పెట్టిన భామ.. లేటెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ నారప్ప చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.
అయితే ఈ మధ్య వెబ్‌సిరీస్‌లపై మక్కువ చూపుతున్నారు హీరో, హీరోయిన్లు. బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల హవా పెరిగింది. రీసెంట్‌గా హీరోయిన్ సమంత ద ఫ్యామిలీ మ్యాన్ 2తో వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్‌తో తాను డ్రీమ్ రోల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు సౌత్ నుంచి మరో హీరోయిన్ అమలాపాల్ వెబ్ సిరీస్‌తో బిజీ కాబోతోంది. జియో స్టూడియోస్ నుంచి రాబోతోన్న ఫస్ట్ వెబ్ సిరీస్ చేయనుంది అమలా. 70వ దశకంలో బాలీవుడ్ లవ్ స్టోరీస్ ఎలా ఉండేవన్న కాన్సెప్ట్‌తో ఓ డ్రామాటిక్ స్టోరీని అందించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ భట్ అధికారికంగా ప్రకటించారు. అమలాపాల్, తహిర్ రాజ్ భాసిన్, అమృతపూరి ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా.. పుష్ప్ దీప్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రేజీ ఆఫర్ దక్కించుకున్న అమలాపాల్ ఫుల్ ఖుషీ అయిపోతోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది భామ.