బన్నీకి రూ.100 పారితోషకం ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా ?

by Anukaran |
బన్నీకి రూ.100 పారితోషకం ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమాలో చిన్న పాత్రతో తెలుగు వెండితెరకు పరిచయం అయి ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో ఎంతో మందికి ఫేవరేట్ హీరో అయిపోయారు బన్నీ. గంగోత్రి సినిమాతో హీరోగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత ఆర్య, బన్నీ, దేశముదురు, ఆర్య 2, వేదం ,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురం‌లో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో ఎవరైన ఉన్నారా అంటే అది బన్నీనే. వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి బన్నీ కొన్ని కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ బన్నీ తన ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ చూస్తే అందరూ షాక్ అవుతారు.

మొదటిసారిగా బన్నీ చిరంజీవి డాడీ సినిమాలో కనిపించి తన డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆ సినిమాలో డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నందుకుగాను దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీకి 100 రూపాయల పారితోషకం ఇచ్చారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా చేసి మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా ఆ సినిమాలో బన్నీ నటనకు కూడా ఫుల్ మార్క్ ఇచ్చారు. ఇలా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు స్టార్ హీరో స్థాయిలో నిలిచారు.

Advertisement

Next Story