- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇవాళ తొమ్మిదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన బన్నీ.తన భార్యపై అమితమైన ప్రేమాభిమానాలను కురిపిస్తూ మెసేజ్ పెట్టాడు. ‘తొమ్మిదేళ్ల వివాహబంధం. కాలం వేగంగా పరుగెడుతోంది. అయినా మన మధ్య ప్రేమ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది’ అంటూ ప్రేమ కురిపించాడు. దీనికి తోడు భార్య, పిల్లలతో కేక్ కట్ చేసిన ఫొటోను ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. జీవితంలో ఎంతో విలువైన బహుమతులను (కుమారుడు, కుమార్తె) నాకు అందించినందుకు థాంక్యూ క్యూటీ అని తెలిపాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2011లో వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు.
tags: stylish star allu arjun, telugu film industry