- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నత విద్యకు రూ.1723 కోట్ల కేటాయింపు
దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్ లో పాఠశాల విద్యశాఖకు రూ. 10,421 కోట్లను, ఉన్నత విద్యా రంగానికి రూ.1723 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలతో పాటు హింధీ అకాడమీతో కలుపుకుని 2019-20 సంవత్సరానికి రూ.480.72 కోట్ల బడ్జెట్ ఉండగా, ఈ ఏడాది మొత్తం యూనివర్శిటీలకు రూ.533.60 కోట్లను కేటాయించారు. వీటిలో అత్యధికంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.343.58 కోట్లు కాగా, కాకతీయ యూనివర్శిటీకి రూ.88.28 కోట్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి రూ.11.59 కోట్లు, పొట్టి శ్రీరాములు యూనివర్శిటీకి రూ.24.88 కోట్లు, తెలంగాణ యూనివర్శిటీకి రూ.26.38 కోట్లు, మహాత్మా గాంధీ యూనివర్శిటీకి రూ.21.63 కోట్లు, శాతవాహన యూనివర్శిటీకి రూ.9.66 కోట్లు, పాలమూరు యూనివర్శిటీకి రూ.7.36 కోట్లు, హింధీ అకాడమీకి రూ.21.11 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇంటర్మీడియట్ విద్యకు గతేడాది రూ.484. 99 కోట్లు కేటాయించగా, 2020-21 సంవత్సరానికి రూ.454 కోట్ల కేటాయింపులు చేశారు. ఇక సాంకేతిక విద్యకు గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం రూ.55 కోట్లను తగ్గించి, రూ.265 కోట్లను మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేసింది.
Tag:Education, Telangana Budget, School, Intermediate, Universities