- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూపై చిన్నచూపెందుకు..?
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది యూనివర్సిటీ విద్యార్థులే అని, అలాంటిది ఉస్మానియా యూనివర్సిటీపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపెందుకని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజాం కళాశాలలో శుక్రవారం ‘సేవ్ ఓయూ’ పేరిట క్యాంపెయిన్ నిర్వహించిన కార్యక్రమంలో హరికృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక బడ్జెట్‌లో ఓయూకు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ బడ్జెట్ కేటాయించారని, ఈ బడ్జెట్‌లో అయినా ఓయూకు రూ.700 కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఉస్మానియా కమిటీ సభ్యులు ఆకం శివసాయి, సాయి భగత్, సందీప్, సురేశ్, వినయ్, వినీత్, నరేశ్, హర్ష, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story