పోలీసులు జర్నలిస్టులను అడ్డుకోవద్దు

by Shyam |
పోలీసులు జర్నలిస్టులను అడ్డుకోవద్దు
X

దిశ, హైదరాబాద్:

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విధి నిర్వహణ నిమిత్తం వెళ్లే జర్నలిస్టులను అడ్డుకోరాదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పోలీసులను కోరారు. కరోనా వైరస్ గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి, సీఎం కేసీఆర్ సూచనలు, పోలీసులు, డాక్టర్లు తీసుకుంటున్న చర్యలు గురించి ప్రజలకు తెలియాలంటే మీడియా అవసరమని అన్నారు. జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగంలోకి వస్తారు కనుక పోలీసులు మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సంక్లిష్ట సందర్భంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మీడియా, పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో కలసి పనిచేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమ్మూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు అందుకు తగిన వాతావరణం కల్పించాలని కోరారు.

Tags: corona, hyderabad, media academy, allam narayana

Advertisement

Next Story