- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలన్నీ ‘పోడు స్వరం’
దిశ, భద్రాచలం: భద్రాద్రి ఏజెన్సీలో రాజకీయ పార్టీలన్నీ ఇపుడు పోడు స్వరం అందుకున్నాయి. పోడు రైతుల సమస్యలపై ప్రజాందోళనలు చేసి రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడం కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణలో ఇపుడు జనమం తా ఓట్లే సే ఎన్నికలు ఏమీలేవు. కనుక ఈ సమయంలోనే పోడు భూముల నుంచి రైతులను ఖాళీ చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. భూములు స్వాధీ నం చేసుకోవడానికి ఫారెస్టు శాఖపై సర్కార్ తీవ్రమైన వత్తిడి పెంచడమే గాకుండా పోడుభూముల స్వాధీనాని కి అటవీ సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టిన ట్లు ఇప్పటికే పోడురైతులు ఆరోపిస్తున్నారు. అందుకే పోలీసుల అండతో అటవీశాఖ అధికారులు దూకుడు పెంచినట్లుగా పోడురైతులు భావిస్తున్నారు. వాళ్ల దూ కుడుకి అడ్డుకట్ట వేయాలంటే రాజకీయ అండదండలు అవసరమనేది రైతుల ఆలోచన. ఏ పార్టీ నుంచి ఏ రకమైన మేలు జరుగుతుందో అనే ఆశతో పోడు రైతు లు ప్రతి పార్టీని ఆశ్రయిస్తున్నారు.
ఆపన్నహస్తాల కోసం..
పోడుభూములు చేజారకుండా ఆదుకునే ఆపన్న హ స్తాల కోసం పోడురైతులు తమ ద్వారాలు తెరిచి ఉంచా రు. దీంతో పోడు సాగుచేస్తున్న ఆదివాసీల మద్దతు లభిస్తుందని రాజకీయ పార్టీలు ఉరుకులు, పరుగులు తీస్తున్నాయి. గతంలో భూపోరాటం ద్వారా పేదలకు భూములు ఇప్పించిన సీపీఎం కొద్దిరోజుల కిందట పోడు భూముల సమస్యలపై కొత్తగూడెంలో ప్రజాగర్జన నిర్వహించి పోడు రైతులకు అండగా ముందు వరుస లో నిలిచింది. దీనికి అంచనాలకు మించి వేలాదిగా పోడు రైతులు స్వచ్ఛందంగా వాహనాలు పెట్టుకొని వెళ్లి కదంతొక్కారు. జిల్లాలో సీపీఎంకి ఇదిపెద్ద పొలిటికల్ మైలేజీగా పేర్కొనవచ్చు.
ఇదే క్రమంలో చర్ల మం డల పరిథిలోని సింగసముద్రం పరిసర గ్రామాల పోడు రైతుల వద్దకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లపు దుర్గాప్రసాద్ తదితరులు వెళ్లి పోడుభూములు పరిశీలించి ఒక్క అంగుళం భూమి కూడా అటవీశాఖ అధికారులు తీసుకోకుండా అడ్డుపడతామని భరోసా కల్పించారు. ఇటీవల మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చర్ల మం డల పర్యటన సందర్భంగా సింగసముద్రం, ఉప్పరిగూ డెం, గన్నారం గ్రామాల పోడు రైతులు కలిసి తమ భూ ములు ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకోకుండా కాపాడాలని మొర పెట్టుకున్నారు. భద్రాద్రి ఏజెన్సీలో ప్రధానమైన పోడుభూముల సమస్య సాధనకై వారం రోజుల్లో చర్ల కేంద్రంగా పోడుసాగుదారులతో భారీ స దస్సు నిర్వహించడానికి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీ జేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యావతి సారథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ మన్యంలో ఇపుడు పోడుభూముల సమస్యనే ప్రధాన అజెండాగా మార్చి ముందుకు సాగుతున్నారు.
పోడు సమస్యలపై కలవని పార్టీలు..
అందరి సమస్య ఒక్కటే.. బాధిత పోడు రైతులకు అన్ని పార్టీలు ఇచ్చే హామీ దాదాపు ఒక్కటే. అలాంటపుడు పోడు రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలన్నీ కలవకుండా విడివిడిగా పోరాటం చేయడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే నాయకులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీల టచ్‌లోకి పోవద్దని, తమ పార్టీ డైరెక్షన్‌లోనే నడవాలని రైతులకు కొందరు రాజకీయ నాయకులు గట్డిగా సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సొంత పార్టీని తోసిపుచ్చలేక, ఇతర పార్టీల వారితో కలవకుండా రైతులు కూడా గ్రూపులు కడుతున్నట్లు సమాచారం.
రాజకీయ స్వార్థంతో నాయకులు పెట్టిన చిచ్చు ఇప్పటివరకు కలసికట్టుగా ఉన్న రైతుల్లో విభేదాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఎత్తుగడల్లో చిత్తవుతున్న పోడు రైతుల మధ్య క్రమేపీ దూరం పెరుగుతోంది. దీనినే ఆసరా చేసుకొని అటవీశాఖ అధికారులు పోడుభూముల స్వాధీనం కోసం వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఆయా గ్రామాల రైతుల దగ్గరకు వెళ్లి మీది కొంత తీసుకుంటాం. మిగతావాళ్ళది మొత్తం తీసుకుంటాం అని నమ్మించి స్ట్రెంచ్ చేస్తున్నట్లు సమాచారం.
పోడు రైతులకు న్యాయం జరిగేనా?
రాజకీయ పార్టీలనే నమ్ముకున్న పోడు రైతులకు న్యాయం జరుగుతుందా అనేది మన్యంలో చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్ మినహా మిగ తా పార్టీలు అన్నీ పోడురైతుల పోరాటానికి అండ గా నిలిచినప్పటికీ ఆయా పార్టీల్లో నాయకుల భిన్న స్వరాలు ఏ మేరకు మే లు చేస్తాయో అనేది ప్రశ్నార్థకంగా ఉంది. గంపెడు ఆశతో పోడు రైతులు పా ర్టీల చెంతకు పరుగులు తీస్తు న్నారు. స్ట్రెంచ్ కొట్టిం చి పోడు భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు పట్డుదలతో ఉన్నారు. నాయకులేమో ఒక్కతాటిపైకి రాకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పొలిటికల్ మైలేజీ కోసం అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో పోడుభూముల రక్షణ ఏ మేరకు సాధ్యం అనేది వేచి చూడాలి.