- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సీఎం పాలన బాగుంది : మనీందర్ జీత్ బిట్టా
దిశ, క్రైమ్ బ్యూరో: రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని, ఉద్యమాల పేరుతో హింసకు పాల్పడటం సరైంది కాదని ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు మనీందర్ జీత్ బిట్టా అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్డులోని మాజీ ప్రధాని పీవీ ఘాట్ జ్ఞానభూమిని సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ… భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి ఎంతో మంది త్యాగల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అలాంటి స్వాతంత్ర్య దేశంలో ఉద్యమం పేరుతో జాతీయ జెండాకు అవమానం జరగడం మంచిది కాదన్నారు. ఎపుడైతే జాతీయ జెండాకు అవమానం జరిగిందో.. అప్పుడే నా తల తీసేసినట్టుగా ఫీల్ అయ్యాయని అన్నారు. దేశంలో నెలకున్న పంజాబ్, కాశ్మీర్ ఉగ్రవాదులను పీవీ ఆనాడే అంతం చేశాడని అన్నారు.
మన దేశం ఆర్థికంగా బలహీనపడిన సందర్భంలో ఆర్థికంగా దేశాన్ని అభివృద్ది బాటలో పయనించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ మరణించిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా.. అవమానపర్చారని అన్నారు. అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పీవీకి ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేసి సముచిత గౌరవస్థానం లభించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం అన్నారు. ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పీవీని సముచితంగా గౌరవిస్తున్నారని అన్నారు. పీవీ నరసింహారావు మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే, పీవీ మృతదేహాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి రానివ్వకుండా అడ్డుపడ్డ విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్న హాయంలో పీవీ ఘాట్‌ను మాజీ ప్రధానులు ఇందిరా, వాజ్ పేయ్, రాజీవ్ గాంధీల ఘాట్ పక్కనే ఏర్పాటుకు ప్రయత్నం జరిగిందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాలన బాగుందని కొనియాడారు. రాబోయే పీవీ జయంతి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పీవీ అభిమానులు మాదవశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.