- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాషన్ గ్రాండ్ మాస్.. తగ్గేదే లేదు
దిశ, ఫీచర్స్ : ‘ఫ్యాషన్ ట్రెండ్స్’ ‘బ్యూటీ టిప్స్’ పదహారు ప్రాయానికే కాదు పళ్లూడిన బామ్మలకు బాగా తెలుసు. ఆయుర్వేదంలోని మూలికలే కాదు, నేటి క్రీముల లోగుట్టులు కూడా వారికి తెలిసినంతగా మిలీనియల్స్‌కు కూడా తెలియకపోవచ్చు. మనిషి జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా నిలిచే ‘ప్రేమ’ ‘పెళ్లి’ వంటి విషయాల్లోనూ అపార అనుభవం వారి సొంతం. జీవితాన్ని పరిపూర్ణంగా చూసిన ఆ పెద్ద మనుషుల లైఫ్ సీక్రెట్స్, మేని మెరుపుల చిట్కాలు, అలంకరణ సూత్రాలు, నడకల్లోని సోయగాలు ఇప్పటి తరానికి అవసరమే. టెక్నాలజీని అందిపుచ్చుకున్న ‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’ ఆయా అంశాల మీద సలహాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకోవడంతో పాటు, నెటిజన్ల అటెన్షన్ డ్రా చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాలో ‘ఎల్డర్లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్’ సత్తా చాటుతున్నారు.
ఇండియా యువరక్తంతో పరుగులు పెడుతుంటే.. చైనాలో ‘వృద్ధుల’ సంఖ్య పెరిగిపోతుంది. చైనా ప్రభుత్వం ఓల్డర్స్ వల్ల భయపడిపోతుంటే.. యువతతో పోటీపడటానికి తామేం తక్కువ కాదని చైనా విమెన్ గ్యాంగ్ నిరూపిస్తొంది. కంప్యూటర్ లేని కాలాన్ని, ఆన్‌లైన్ సంస్కృతిని రెండింటిని సమగ్రంగా చూసిన తరం ఆ పెద్దలది. నేటితరం అమ్మాయిల అభిరుచులపై అవగాహనే కాదు.. ఆతరం నాటి మంచి విషయాలు, జీవిత విలువలపై పట్టున్న జ్ఞానం వారి సొంతం. ఫ్యాషన్, బ్యూటీ, లవ్, మ్యారేజ్, లైఫ్ వంటి అంశాలపై పట్టున్న పండితులు కనుకే.. తమ అనుభవాలు, ఫ్యాషన్ టిప్స్ అందిస్తూ వాళ్లు చేస్తున్న వన్ మినట్ వీడియోలు, లైమ్ స్ట్రీమింగ్స్ ప్రపంచవ్యాప్త నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఉమెన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తున్న వీడియోలను చైనా టిక్‌టాక్ వెర్షన్ అయిన ‘కుయిషౌ’, ‘డౌయిన్’లలో అప్‌లోడ్ చేస్తారు. వీరికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో పాప్-అప్ ప్రకటనలు, లైవ్ స్ట్రీమింగ్ ప్రొడక్ట్స్ సేల్స్ ద్వారా డబ్బులు వస్తుంటాయి. ఈ గ్రానీస్ తమ లైవ్ స్ట్రీమ్ ప్రారంభించిన నిముషంలోనే 200 యూనిట్ల ఉత్పత్తిని సేల్ చేస్తుంటారు. సాధారణంగా చేతిలో కర్రపట్టుకునే వయసులో, కెమెరా పట్టుకుని వృద్దాప్యంలోనూ చేతినిండా సంపాదిస్తున్నారు. ఇంతకీ వాళ్ల గ్రూప్ పేరు ఏంటంటే.. ‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’.
‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’ గ్రూపులో మొత్తంగా 23 మంది ప్రధాన సభ్యులుండగా, దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ సహాయకులు ఉన్నారు. వీరంతా 50ప్లస్ టు మిడ్ 70 వయసులో ఉంటారు. ‘అందం యువతకు మాత్రమే కాదు వృద్ధులకు అవసరమే’. ‘వృద్ధాప్యంలో కూడా అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చనే ఇన్‌స్పిరేషన్ వీడియోలతో పాటు, గృహ హింస, మ్యారిటల్ రేప్ వంటి తీవ్రమైన సందేశాలపై కూడా తమ గొంతుక వినిపిస్తారు. ఉదాహరణకు.. ‘ఓ యంగ్ మ్యాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఓ స్టోర్‌లో కొట్టడానికి చేయి ఎత్తుతాడు. వాళ్లముందున్న వృద్ధ మహిళ ఆ అమ్మాయిని పక్కకు లాగి కోపంతో అతడి వైపు చూస్తుది. ఆ వీడియోపై ‘గృహ హింస చట్టవిరుద్ధం” ‘‘మహిళలను కొట్టడం సిగ్గుచేటు” అనే అక్షరాలు కనిపిస్తాయి.
1950 -60 తరానికి చెందిన ఈ మహిళలు మావో-యుగ సాంస్కృతిక విప్లవం తరువాత ఉన్నత విద్యను పొందిన మొదటి సమూహం. సామాజిక చైతన్యం లేని తరానికి విలువలు చెప్పేందుకు టెక్నాలజీని ఎంచుకుంది. వీళ్లంతా ధనవంతులు, ఉన్నత విద్యావంతులు. ఈ గ్రూప్ చైనా ఎల్డర్లీ ఇంటర్నెట్ పరిశ్రమ ‘క్యాషబిలిటీ’ నాణ్యతను మెరుగుపరుస్తుంది. కొవిడ్ -19 మహమ్మారి కూడా వృద్ధులను ఆన్‌లైన్ బాట పట్టేలా చేసింది. షాపింగ్, వినోదం ఇప్పుడంతా ఇంటర్నెట్‌లోనే.
– బియాన్ చాంగ్యాంగ్, బీజింగ్ డామా టెక్నాలజీ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ( ‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’ సోషల్ మీడియాను నడపడానికి సహాయపడే కంపెనీ)
‘లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను అనుభవిస్తూ.. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న మా లాంటి గ్రానీలను చూసిన తరువాత మమ్మలి ఫాలో చేసే యంగ్ ఫ్యాన్స్ వృద్ధాప్యానికి భయపడరు. నేను ఫ్యాషన్ గ్రాండ్‌మాస్‌లో సభ్యురాలిని. నాకో యూట్యూబ్ చానల్ ఉంది. బీజింగ్ చరిత్ర, సంస్కృతిని నా వీడియోల ద్వారా వివరించే ప్రయత్నం చేశాను. 6మిలియన్ల మంది అభిమానులను సొంతం చేసుకోగలిగాను. ఇరుకు గదుల్లో ఓ మూలన ఉండటం కన్నా ఇలా విహరిస్తూ.. మనకు నచ్చిన ప్రపంచంలో బతకడం ఎంతో అవసరం. మాది బంగారు తరం కానీ నేటితరం యువకులు వృద్ధులకు ఏమీ తెలియదని అనుకుంటారు. వాస్తవానికి మాకు ప్రతిదీ తెలుసు. వృద్ధులు వారు కోరుకున్న విధంగా జీవించాలి. ఆప్టిమిస్టిక్‌గా ఉండాలి. వయస్సు కేవలం ఒక సంఖ్య అని అందరూ గుర్తుంచుకోవాలి’.
– రువాన్ యాకింగ్ (58)