హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. కన్యాదానం ఉన్నప్పుడు పురుషదానం ఉండకూడదా?

by Shyam |   ( Updated:2021-09-23 04:31:43.0  )
హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. కన్యాదానం ఉన్నప్పుడు పురుషదానం ఉండకూడదా?
X

దిశ, సినిమా : పెళ్లి వస్త్రాలకు మారుపేరుగా నిలుస్తున్న ‘మాన్యవర్’ న్యూ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలియా భట్ నటించిన ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో.. వివాహం జరిగినప్పుడు వధువు మదిలో మెదిలే భావాలను పొందుపరిచారు. ‘కన్యాదానం’ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేసిన యాడ్‌లో.. ఇక అప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల పరాయి అమ్మాయి అయిపోవాల్సిందేనా అనే కాన్సెప్ట్‌ను వివరించారు. జనరేషన్ మారినప్పుడు కన్యాదాన్‌కు బదులు కన్యామాన్(కన్యను గౌరవించాలి)ను ఎందుకు ఫాలో కాకూడదని సూచించింది. వధువు బాధ్యతను మెట్టినింటికి అప్పగించి కన్యాదానం చేసే బదులుగా.. వధూవరుల బాధ్యతను ఇరు కుటుంబాలు తీసుకోవడం మంచిది కదా అని మెసేజ్ ఇచ్చారు. అది ట్రెడిషనే కావచ్చు కానీ కొత్తగా ఆలోచించడంలో తప్పులేదు కదా అని చెప్పారు.

కాగా ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. కన్యాదాన్ అనేది వేదాలలో స్పెషల్‌గా ఎక్కడా మెన్షన్ చేయలేదని చెప్పారు. మన పెళ్లి సాంప్రదాయాల్లో అసలు లేదని మధ్యలోనే యాడ్ అయిందని తెలిపారు. ఈ పదాన్ని తొలగిస్తేనే మంచిదని తెలిపారు. ఇలా మధ్యలో వచ్చిన కన్యాదానం కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నప్పుడు.. పురుషదానం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed