రిషి అంకుల్ ప్రేమ గొప్పది : అలియా భట్

by Shyam |
రిషి అంకుల్ ప్రేమ గొప్పది : అలియా భట్
X

అలియా భట్.. రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉంది. మరికొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోబోతోంది. ఈ సందర్భంగా మామ రిషి కపూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

View this post on Instagram

❤️❤️❤️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

” ఈ అందమైన వ్యక్తి గురించి ఏం చెప్పగలను. నా జీవితంలోకి మంచితనం, ప్రేమను తీసుకొచ్చిన వ్యక్తి గురించి ఏమని వివరించను. ప్రతీ ఒక్కరూ ఆయనను లెజెండ్ గా అభివర్ణిస్తున్నారు. కానీ అంతకు మించిన గొప్ప మనిషి రిషి కపూర్ అని తెలిపింది అలియా. గత రెండేళ్లుగా ఆయనను స్నేహితుడిగా చూస్తున్న.. తను చైనీస్ ఫుడ్ లవర్, సినిమా ప్రేమికుడు, ఫైటర్, లీడర్, అందమైన కథలు చెప్పే స్టొరీ టెల్లర్, ఉద్వేగ భరితమైన ట్వీటర్, బాధ్యతాయుతమైన తండ్రి అని చెప్పింది. ఈ రెండేళ్లలో ఆయన నుంచి పొందిన ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను. తన గురించి తెలుసుకునేలా చేసిన ఈ విశ్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ క్షణం మనమంతా ఆయనను మన కుటుంబ సభ్యుడిగా చూస్తున్నాం అంటే కారణం రిషి అంకుల్ మనపట్ల చూపిన ప్రేమ.
లవ్ యూ రిషి అంకుల్.. మిస్ యూ… అంటూ నివాళి అర్పించింది అలియా.

Tags: Rishi Kapoor, Alia Bhatt, Bollywood, Ranbeer Kapoor

Advertisement

Next Story