- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్‌బీర్‌కు మరింత దగ్గరయ్యే ప్లాన్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. తమ ప్రేమ గురించి మీడియాకు కూడా బహిరంగంగా వివరించిన ఈ జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటూనే ఉంటారు. రణ్‌బీర్ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటున్న ఆలియా.. పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తుందని టాక్. ఈ క్రమంలో తనకు మరింత దగ్గరయ్యేందుకు బాంద్రాలో రణ్‌బీర్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే కొత్తగా ఫ్లాట్ తీసుకున్న ఆలియా.. గృహప్రవేశ కార్యక్రమం కూడా ముగించేసింది. ఇక రణ్‌బీర్ ఏడో అంతస్తులో ఫ్లాట్ తీసుకుంటే.. అదే అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో ఆలియా సెటిల్ అయిపోనుంది. ఇప్పటికే ముంబైలోని జుహూ, లండన్‌లోని కోవెంట్ గార్డెన్‌లో ఆలియాకు సొంతిల్లు ఉండగా.. ఇప్పుడిది మరొకటి. అది కూడా రణ్‌బీర్‌కు దగ్గరయ్యేందుకే. మరి అలాంటప్పుడు ఇంటీరియర్ డిజైన్ కూడా అదిరిపోవాలి కదా.. అందుకే ఆ బాధ్యతలను షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్‌కు అప్పగించినట్లు సమాచారం.