నిర్మాత వేధింపులు.. సినిమా వదులుకున్న హీరోయిన్

by Shyam |
Alankrita-Sahai
X

దిశ, సినిమా : హీరోయిన్ అలంకృత ‘ఫప్ఫడ్ జీ’ సినిమాతో పంజాబీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాల్సి ఉండగా.. చిత్రనిర్మాతల్లో ఒకరి వేధింపులు తట్టుకోలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. అన్‌ప్రొఫెషనల్ అటిట్యూడ్, మిస్‌బిహేవ్ చేయడంతో సినిమా నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపింది. ‘ఎవరైనా ఎదుటివారితో లిమిట్స్‌లో ఉండాలని, మాటలతో కూడా సరిహద్దులు దాటకూడదన్న అలంకృత.. ప్రొడ్యూసర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు సహించలేకపోయానని.. ఒక మహిళగా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే ఇలా చేశా’నని వివరించింది.

డబ్బు, పవర్ ఉన్నాయనే గర్వంతో వాటిని దుర్వినియోగం చేయరాదన్న హీరోయిన్.. వేధింపులతో తనను అణిచివేసేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అయితే తాము పర్సనల్‌గా కలవలేదని.. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా అసభ్యకరమైన ఫొటోలు పంపిస్తూ అనుచితంగా ప్రవర్తించేవాడని చెబుతూ.. దీన్ని #MeToo కేసులో చేర్చాలని అనుకోవడం లేదు కానీ తాను తీసుకున్న నిర్ణయం ఆయన ప్రవర్తనలో మార్పుతీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. కాగా జీ స్టూడియోస్‌తో కలిసి కే కుమార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘ఫప్ఫడ్ జీ’ సినిమాకు పంకజ్ బత్రా దర్శకులు.

Advertisement

Next Story

Most Viewed