కరోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

by vinod kumar |
కరోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
X

రియాద్: కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా సంచలనం నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రంజాన్ మాసంలో మసీదులను తెరిచి ఉంచితే కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందనీ, అందుకే మూసివేయాలని నిర్ణయించినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసంలో ప్రపంచ నలుమూలల నుంచి ముస్లింలు మక్కా యాత్రకు వచ్చి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ ట్వీట్ చేశారు. తరావీ నమాజ్, రంజాన్ ఈద్ నమాజ్‌ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. కాగా, సౌదీలో ఇప్పటి వరకూ సుమారు 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 100 మందికి పైగా మృతి చెందారు.

Tags: Saudi Arebia, Al Haram Maszid, Close Ramzan, Corona Virus

Advertisement

Next Story

Most Viewed