- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగ్విజయంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణం..
దిశ, జగిత్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గత మార్చి 17న అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో రామకోటి పుస్తకాలు సమర్పించిన విషయం తెలిసిందే. అఖండ హనుమాన్ చాలీసా పారాయణం రేపు (శుక్రవారం)తో ద్విమండల(82 రోజులు) కాలం పూర్తి చేసుకోనుంది. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రంలోని 3,200 హనుమాన్ దేవాలయాలతో పాటు, ప్రతి ఇంట్లో పదకొండు సార్లు చాలీసా పారాయణంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో మార్చి 17 నుండి ఆలయంలో జరుగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జూన్ 4న దిగ్విజయంగా రెండు మండలాల (82 రోజులు) పూర్తి చేసుకోనుంది.
ఈ సందర్భంగా గత 82 రోజులుగా ఈ మహోన్నత ఆధ్యాత్మిక పుణ్యకార్యంలో పాలు పంచుకుంటున్న అశేష భక్త జనానికి పూజారులు, పండితులకు, ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు. దేవస్థానం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. లాక్‌డౌన్ తీవ్రత కారణంగా అభివృద్ధి పనులు కొంత నెమ్మదించాయని, లాక్‌డౌన్ ఎత్తివేశాక తిరిగి ప్రారంభమవుతాయన్నారు.లాక్‌డౌన్ ప్రారంభానికి ముందే కొండగట్టులో నూతన హెలిప్యాడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపం పనులు లాక్‌డౌన్ కారణంగా కొంత నెమ్మదించినా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. భక్తులు సిద్ధం చేసిన రామకోటి ప్రతులను లాక్‌డౌన్ ముగిసిన అనంతరం స్వీకరిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు.