అజయ్ దేవ్‌గన్‌తో ‘నాంది’ పలకనున్న దిల్ రాజు

by Shyam |   ( Updated:2021-06-25 02:40:36.0  )
అజయ్ దేవ్‌గన్‌తో ‘నాంది’ పలకనున్న దిల్ రాజు
X

దిశ, సినిమా :విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాంది’. వరలక్ష్మి శరత్ కుమార్, దేవీప్రసాద్, ప్రియదర్శి లీడ్ రోల్స్ పోషించిన చిత్రం నరేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్‌గన్ తెలిపారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఈ మూవీని బాలీవుడ్‌లో నిర్మిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాంది తెలుగు చిత్రంలో సూర్యప్రకాశ్ అనే యువకుడి పాత్ర పోషించిన నరేష్.. చేయని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా రీమేక్‌లో నరేష్ క్యారెక్టర్ ఎవరు చేస్తారనే విషయంతో డైరెక్టర్, కాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ‘రుద్ర’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న అజయ్ దేవ్‌గన్.. రాజమౌళి మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story