- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జక్కన్న స్నేహం చాలంటున్న అజయ్ దేవ్గన్
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే అంత క్రేజ్ ఉండడం అతిశయోక్తేం కాదు. బాహుబలితో తెలుగు సినిమాస్థాయిని పెంచిన జక్కన్న నుంచి మరో సినిమా రావడం… అది కూడా తారక్, చెర్రీల మల్టీస్టారర్ కాంబినేషన్ కావడం… కొమురం భీం, అల్లూరి సీతారామరాజులను స్టోరీలైన్గా ఎంచుకోవడంతో భారత్ మీడియా మొత్తం అసలు జక్కన్న ఏం చేస్తున్నాడనే దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఈ మధ్యే షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమా కోసం అజయ్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయ్. కానీ, అజయ్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నాడని సమాచారం. రాజమౌళితో ఉన్న స్నేహం వల్లే ఈ నిర్ణయానికి వచ్చారట అజయ్ దేవ్గన్. నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తామన్నా వద్దని చెప్పాడట.
2012లో రిలీజ్ అయిన రాజమౌళి సినిమాకు హిందీ వెర్షన్లో డబ్బింగ్ చెప్పాడు అజయ్ దేవ్గన్. అప్పటి నుంచి వీరి స్నేహబంధం మొదలు కాగా ఆర్ఆర్ఆర్లో ఫ్రెండ్లీ అప్పియరెన్స్ ఇస్తానని చెబుతున్నాడట. అంతే కానీ నాకు ఒక్క రూపాయి కూడా వద్దని స్పష్టంగా చెప్పాడట. అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో తారక్, చెర్రీల గురువుగా కనిపిస్తారని టాక్.