- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులు.. జర జాగ్రత్త
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని, ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్ జీఈఎఫ్) సూచించింది. ఆదివారం జాతీయ కార్య వర్గ సమావేశం మీట్ ఆప్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐఎస్ జీఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుభాశ్ లాంబ, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి టీఎన్జీవో నేతలు కారం రవిందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, బండారు రేచల్, కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. 29 రాష్ట్రాల నుంచి దాదాపు 52 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని టీఎన్జీవో చేసిన ప్రతిపాదనలను సమావేశంలో అంగీకరించారని.. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటరీకి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖలు రాయాలని తీర్మానించినట్లు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆగష్టు 9న “సేవ్ ఇండియా” పేరుతో చేపడుతున్న సత్యాగ్రహ నిరసన కార్యక్రమానికి ఏఐఎస్ జీఈఎఫ్ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.