46 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిన ఎయిర్‌టెల్

by Harish |   ( Updated:2021-07-29 11:46:53.0  )
46 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిన ఎయిర్‌టెల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం మార్కెట్లో మే నెలకు సంబంధించి దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 46.13 లక్షల మంది వైర్‌లెస్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. ఇక, దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా 35.54 లక్షల మంది వినియోగదారులను చేర్చుకున్నట్టు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. మొత్తంగా మే నెలలో 62.7 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు తగ్గారని గణాంకాలు తెలిపాయి. జియో కొత్త వినియోగదారులను సంపాదించడంతో మొత్తం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 43.12 కోట్లను చేరుకుంది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇరు సంస్థలూ మేలో భారీగా కస్టమర్లను పోగొట్టుకున్నాయి. ఎయిర్‌టెల్ 46 లక్షల మందికి పైగా కోల్పోవడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 34.8 కోట్లకు చేరుకుందని ట్రాయ్ గణాంకాలు తెలిపాయి. వొడాఫోన్ ఐడియా 42.8 లక్షల మందిని పోగొట్టుకోవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 27.7 కోట్ల మందిని కలిగి ఉంది. కొవిడ్ సెకెండ్ వేవ్ పరిణామాల మధ్య మే నెలలో వినియోగదారులు 62.7 లక్షల మంది తగ్గడంతో మొత్తం 117.6 కోట్లకు తగ్గినట్టు గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story