- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్టమర్లకు షాకివ్వనున్న ఎయిర్‌టెల్!
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌టెల్ కంపెనీ తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడింది. రానున్నరోజుల్లో మొబైల్ టారిఫ్ చార్జీలు భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ధరల పెంపుతో సతమతమౌతున్న వినియోగదారులు రానున్న రోజుల్లో మరింత ఆర్ధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెలికం కంపెనీలు కూడా ఇదే బాటలోనే నడుస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు చార్జీలను పెంచేశాయి.
రానున్న రోజుల్లో మొబైల్ టారిఫ్ చార్జీల్లో మరింత పెరుగుదల ఉంటుందని ఎయిర్‌టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ తెలిపారు. ఎయిర్‌టెల్ ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత ఆయన ఓ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. అయితే, ధరల పెంపు ఎప్పటినుంచి ఉంటుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఇదిలాఉండగా, యూజర్ నుంచి పొందే సగటు ఆదాయాన్ని(ఏఆర్‌పీయూ) రూ. 200, రూ. 300గా నిర్దేశించుకున్నట్లు విట్టల్ చెప్పార. సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ. 162కు చేరిన విషయం తెలిసిందే. ఏడాది కిందట ఇది రూ. 128గా ఉంది. దీనిని రూ. 200కు, ఆ తర్వాత రూ. 300కు పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.