జూన్-జులైలో కేసుల తీవ్రత పెరగొచ్చు : ఎయిమ్స్ డైరెక్టర్

by Shamantha N |
జూన్-జులైలో కేసుల తీవ్రత పెరగొచ్చు : ఎయిమ్స్ డైరెక్టర్
X

కరోనా మహమ్మారి ఇంకా భారత్‌లో తీవ్రరూపం దాల్చలేదని, కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే జూన్-జులైలో వైరస్ తీవ్రత పెరగొచ్చని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. గత కొన్నివారాలుగా ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి కారణంగా నాలుగు నెలల్లో 53,000 పాజిటివ్ కేసులు నమోదవగా, 1800 మంది చనిపోయారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో కేసుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ముప్పు తొలగిపోనుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా.. నిపుణులు, వైద్య సిబ్బంది మాత్రం తీవ్ర పరిస్థితులు ఎదురవనున్నాయనే భావిస్తున్నారు. పెరుగుతున్న కేసులు, డేటా విశ్లేషణ ప్రకారం జూన్-జులైలో పీక్ స్టేజ్‌కు చేరే అవకాశాలున్నాయని రణదీప్ గులేరియా వెల్లడించారు.

Tags: Corona outbreak, India, AIIMS Director, June-July

Advertisement

Next Story

Most Viewed