Sunflower : పొద్దుతిరుగుడు సాగుకు రైతులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు.. కారణం ఇదేనా?

by Prasanna |
Sunflower : పొద్దుతిరుగుడు సాగుకు రైతులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు.. కారణం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి జిల్లాలో కొద్దీ రోజుల క్రితం ఎక్కడ చూసినా పొద్దుతిరుగుడు పూలు కనిపించేవి. ఇవి చూడటానికి కన్నుల పండుగగా ఉండేది. ఎటు వైపు చూసినా ఆ పువ్వులే కనిపించేవి. గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఈ పంటపైనే దృష్టి పెట్టేవారు. ఎందుకంటే దీని సాగు కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలాగే లాభాలు కూడా అధికంగా వస్తాయి. అయితే, ఇప్పుడు వీటి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఈ పంటను వేయడమే మానేశారు.

గడిచిన ఐదేళ్ల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఈ పొద్దుతిరుగుడు పంట అసలు కనిపించడం లేదు. ఈ ఏడాది పలు జిల్లాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. రైతులు చాలా కష్టపడి పంటను పండిస్తున్నారు అయితే, మార్కెట్లో వీటికి గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఒకప్పుడు క్వింటా రూ.6 వేలు ఉండేది. కానీ, ప్రస్తుతం రూ.2 వేల నుంచి రూ.3500 వరకు ధర ఉందని చెబుతున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో కొందరు నకిలీ విత్తనాలను అమ్మడం వలన పంట దిగుబడి సరిగా వచ్చేది కాదు.

ఇలా ఒకటి కాకుండా ఎన్నో కారణాలతో రైతులు ఈ పంటను పక్కన పెట్టేశారు. పైగా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం, పామాయిల్ వాడకం ఎక్కువగా ఉండటం వలన వీటి డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed