Bamboo Farming: రైతులను లక్షాధికారులను చేస్తున్న పచ్చ బంగారం సాగు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు

by Prasanna |
Bamboo Farming: రైతులను లక్షాధికారులను చేస్తున్న పచ్చ బంగారం సాగు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో వ్యవసాయం పైనే ఆధారపడి బతికే వాళ్ళు చాలా మందే ఉన్నారు. పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఏడాదికి రెండు, మూడు పంటలు వేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పాత పద్ధతులనే పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు.

కొందరు తెల్ల బంగారం పండిస్తే మరికొందరు పచ్చ బంగారం పండించి డబ్బును సంపాదిస్తున్నారు. రాజస్థాన్‌లోని రైతులు వెదురుతో ఆర్థికంగా లాభ పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ సాగు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలతో పోలిస్తే దీనిని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది.

వాతావరణం కూడా వెదురు సాగుకు అనుకూలిస్తుందని కృషి విజ్ఞాన కేంద్రం నిపుణులు వెల్లడించారు. వెదురు సాగుకు మామూలు ఉష్ణోగ్రత కంటే 10 నుంచి 15 డిగ్రీలు అవసరం. అలాగే, ఈ చెట్టు కుళ్లిన ఆకులను ఎరువుగా కూడా వాడుతుంటారు. ఒకసారి సాగు చేస్తే కొన్నాళ్ల పాటు వెదురు బాగా పండుతుంది. వెదురు పంట ఏ సీజన్‌లోనూ పాడవ్వదు. ఒక ఎకరం వెదురు సాగులో 40 నుంచి 50 టన్నుల వస్తుంది. మొక్క ఎదిగే కొద్దీ ఏటా 25 శాతం దిగుబడి పెరుగుతుంది.

Advertisement

Next Story