హింసాత్మకంగా మారిన ఆందోళన

by Shyam |   ( Updated:2020-12-12 05:49:32.0  )
హింసాత్మకంగా మారిన ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో విస్ట్రాన్ కంపెనీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాగా కంపెనీలో ఉద్యోగులు శనివారం విధ్వంసానికి దిగారు. కంపెనీ కార్యాలయానికి ఉద్యోగులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయంలోని ఫర్నీచర్ దగ్దం అయింది. ఈ ఘటనలో రూ. 6 కోట్ల విలువైన కంపెనీ బస్సులు, కార్లు ధ్వంసం అయినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం సుమారు రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లి నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

సుమారు 100 మందికి పైగా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్యోగులను వదిలివేయాలంటూ ఎస్పీ ఆఫీస్ ఎదుట వారి బంధువులు ధర్నాకు దిగారు. అయితే చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉద్యోగులు విధ్వంసానికి పాల్పడ్డారని ఐజీ సీమంత్ కుమార్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఆయన అన్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా విధ్వంసానికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేస్తామని ఐజీ సీమంత్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు.

Advertisement

Next Story