- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంక్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద NBFCలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లో HDFC లిమిటెడ్, ప్రైవేట్ దిగ్గజ ICICI బ్యాంక్ తర్వాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (People’s Bank of China) ఈక్విటీ పెట్టుబడులను పెట్టిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెట్టుబడుల అంశం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్-చైనా సరిహద్దు వివాదం, చైనా యాప్‌ల నిషేధాల మధ్య గత నెలలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రైవేట్ రంగం బ్యాంక్ ICICI బ్యాంకులో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance)లో చైనా సంస్థ పెట్టుబడి 1 శాతం కన్నా తక్కువని, దీనివల్ల షేర్‌హోల్డింగ్ పద్ధతిపై ప్రభావం ఉండదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.
అయితే, ఈ పెట్టుబడి ఎప్పుడు పెట్టారనే విషయం ఇంకా తెలియలేదు. ఫిబ్రవరిలో జరిగి ఉండొచ్చని, బజాజ్ ఫైనాన్స్ వాటా ధర ఆ సమయంలో సుమారు రూ. 4,800 నుంచి రూ. 2,200కి పడిపోయిందని, ఆ సమయంలో వ్యూహాత్మకంగానే ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో చైనా కంపెనీలు పెట్టుబడులు పెంచాయని భావిస్తున్నారు. కాగా, చైనాతో ఉన్న వివాదం నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల నియమాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనా పెట్టుబడిదారులను నివారించడానికి ఈ నిబంధనలు జారీ చేశారు.