టారిఫ్ ప్లాన్ ధరలు పెంచిన రిలయన్స్ జియో!

by Harish |
టారిఫ్ ప్లాన్ ధరలు పెంచిన రిలయన్స్ జియో!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో ధరల పరుగు పందెం జరుగుతోంది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్‌ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. తాజాగా రిలయన్స్ జియో సైతం టారిఫ్ ధరలను పెంచుతూ ఆదివారం నిర్ణయాన్ని వెల్లడించింది.

ఆదివారం జియో తన టారిఫ్ ధరలను 20-21 శాతం పెంచింది. పెంచిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమలవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ పెంపు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే తక్కువగానే ఉన్నాయి. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో టెలికాం పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు జియో తన టారిఫ్ ప్లాన్‌లలో మార్పు చేసిందని’ రిలయన్స్ జియో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనివల్ల పరిశ్రమలో మెరుగైన సేవలందించేందుకు వీలుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరకే నాణ్యమైన సేవలందించడంలో జియో దాన్ని కొనసాగిస్తోందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో ప్రకటన ప్రకారం.. గతంలో 28 రోజుల వ్యాలిడిటీతో అందించిన రూ. 75 ప్లాన్‌ను రూ. 91కి పెంచింది. అలాగే, రూ. 129 వాయిస్, డేటా ప్లాన్‌ను రూ. 155కి పెంచింది. 59 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 299 ప్లాన్‌ను రూ. 479కి, 84 రోజుల వ్యాలిడిటీతో లభించే రూ. 329 ప్లాన్‌ను రూ. 395కి, 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 2,399 ప్లాన్‌ను రూ. 2,879కి పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. డాటా ప్లాన్‌లలో రూ. 51ని రూ. 61కి, రూ. 101ని రూ. 121కి, రూ. 251 ప్లాన్‌ను రూ. 301కి పెంచింది.

jio plans

Advertisement

Next Story