- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోరాడి మరీ.. కోరుకున్నవాడిని పెళ్లాడింది!
దిశ, డోర్నకల్ :
వాళ్లిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. తీరా ఆ సమయం దగ్గరపడే సరికి ఏం జరిగిందో తెలీదు. ప్రియుడు పలు కారణాలు చెబుతూ ఆమెను దూరంగా పెట్టాడు. పెళ్లి నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ ప్రియురాలు తాను ప్రేమించివాడిని తనకిచ్చి వివాహం జరిపించాలని కోరుతూ అతని ఇంటి ఎదుట నాలుగు రోజులుగా నిరసన దీక్ష చేస్తోంది. గ్రామస్థులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతివ్వడంతో పాటు ఇరు కుటుంబాలను ఒప్పించడంతో ఎట్టకేలకు మంగళవారం ఆలయంలో ప్రేమికులిద్దరూ ఒకటయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకివెళితే..వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేటకు చెందిన చాగంటి సృజన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోలు గ్రామానికి చెందిన తగరు అఖిల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులుగా యువతి పెళ్ళి చేసుకోమని అఖిల్‌ను అడుగుతుండగా ఏదో ఒక కారణం చెబుతూ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో నాలుగు రోజులుగా సృజన ప్రియుడు అఖిల్ స్వగ్రామం సిరోలులోని ఇంటి ఎదుట బైటాయించి నిరసన తెలిపింది. అతడితో వివాహం జరిపించాలని ఒంటరి పోరాటం చేస్తుంది. ఆఖరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. విషయం తెలుసుకున్నరజక సంఘం నాయకులు, విద్యార్థి సంఘాలు, యువతీ యువకులు, ప్రజా ప్రతినిధులు యువతికి మద్ధతు ప్రకటించారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులు చర్చించుకుని వారి ప్రేమను అంగీకరించి సీరోలు గ్రామం లోని ఆలయంలో ఆ జంటకు వివాహం జరిపించారు.