రెండు నెలలుగా శోభనం వాయిదా.. తట్టుకోలేని భర్త ఏం చేశాడంటే..?

by Anukaran |   ( Updated:2021-06-23 07:16:46.0  )
man married transgender
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు అతను. అందమైన భార్య రావడంతో ఇక తన జీవితం ఇంకా కళకళలాడిపోతుందనుకున్నాడు. పెళ్లి తర్వాత మొదటి రాత్రి కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూశాడు. కానీ భార్య మాత్రం అనారోగ్యంగా ఉందని అనడంతో సరే అని వదిలేశాడు. కానీ అలానే ప్రతిసారి అనడంతో భర్తకు అనుమానామొచ్చింది. ఇంకేముంది భార్యను వైద్య పరీక్షలకు తీసుకెళ్లాడు. అక్కడ అసలు నిజం బయటపడడంతో భర్త గుండె ఆగింది. తాను పెళ్లి చేసుకున్నది అమ్మాయిగా మారిన ఓ అబ్బాయినని తెలుసుకొని భర్త కుప్పకూలిపోయాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కి చెందిన ఓ వ్యక్తి(28) కి ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది. దీంతో భర్త గట్టిగా నిలదీయడంతో తనకు ఆరోగ్యం బాలేదని, కొద్దిరోజులు దూరంగా ఉండాలని చెప్పింది. రెండు నెలలైనా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అనుమానమొచ్చిన భర్త, భార్యను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రిపోర్ట్స్ లో భార్య ట్రాన్స్ జెండర్ అని, కొద్దినెలల క్రితమే ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిందని వైద్యులు తెలపడంతో అవాక్కయ్యాడు. తాను మోసపోయానని, అమ్మాయి అని చెప్పి తనకు సంబంధం కుదిర్చిన మధ్యవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed