- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్గాన్ నుంచి తప్పించుకున్న సింగర్.. అక్కడి పరిస్థితులపై ఆందోళన
దిశ, సినిమా: యూఎస్, నాటో దళాలు ఆఫ్గానిస్తాన్‌ను నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్ల అరాచక పాలనకు భయపడుతున్న అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కాబూల్ నుంచి తను ఏవిధంగా బయటపడిందో ఆఫ్గాన్ సింగర్ అర్యానా ఎన్డీటీవీకి తెలిపింది. “నేను కాబూల్ నుంచి విమానంలో బయలుదేరే సరికే తాలిబన్లు అన్నిచోట్లా వ్యాపించి ఉన్నారు. ఎయిర్‌పోర్టుకు వేలాదిమంది రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గుంపులు గుంపులుగా జనం, పిల్లల ఏడుపులతో ఊపిరి పీల్చుకోలేకుండా ఉంది. ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. నేను నిజంగా అదృష్టవంతురాలిని.. UK పాస్‌పోర్ట్ ఉండటంతో బయటపడగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో ఓ మహిళ.. తన బిడ్డను తీసుకెళ్లమని ప్రాధేయపడిందని, కానీ తల్లిబిడ్డను వేరు చేయడం ఇష్టం లేక అలాచేయలేదని చెప్పింది. అయితే ఇద్దరినీ తీసుకెళ్తానని అక్కడున్న సోల్జర్‌ను అడిగానన్న అర్యానా.. దురదృష్టవశాత్తు అందుకు అనుమతించకపోవడంతో ఆ బిడ్డను తిరిగిచ్చేశానని వెల్లడించింది. తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్ మహిళలకు భవిష్యత్ ఉండదని అభిప్రాయపడింది. కాగా యూఎస్ నేతృత్వంలోని మిలిటరీ.. ప్రతీరోజు వేలాదిమంది ఆఫ్గాన్ ప్రజలను విమానాల్లో అక్కడి నుంచి తరలిస్తోంది.
- Tags
- afghanistan
- kabul