- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉమన్స్ ఆసియన్ కప్ షెడ్యూల్

X
న్యూఢిల్లీ: ఆసియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహిళల ఆసియన్ ఫుట్‌బాల్ కప్ షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీని వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్వహించనున్నట్టు ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) గురువారం ప్రకటించింది. 2018లో జరిగిన ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా, వచ్చే సీజన్‌లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. దీంతో 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపులో 4 జట్లను ఉంచనున్నారు. 18 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 25 మ్యాచ్‌లు ఆడించనున్నారు. 2023లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న చారిత్రాత్మక ఫిఫా ఉమన్స్ వరల్డ్ కప్‌కు అర్హత టోర్నీగానూ ఇది ఉపయోగపడనుంది. ఆసియన్ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లు ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు ఎంపికవుతాయి.
Next Story