- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు విమాన సర్వీసులు
దిశ రాజేంద్రనగర్ : జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. స్టార్ ఎయిర్ విమానం ఓజీ 150 జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 03.20 కి బయలుదేరి, సాయంత్రం 05.20 జామ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఓజీ 149 జామ్‌నగర్ నుంచి ఉదయం 9.15 గంటలకు బయలుదేరి, 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, జామ్‌నగర్ మధ్య వారానికి మూడు సార్లు – మంగళవారం, గురువారం, శనివారం విమానాలు నడుస్తాయి. జ్యువెల్ ఆఫ్ కథియావర్‌గా ప్రసిద్ధి చెందిన జామ్‌నగర్, శతాబ్దాల నాటి అద్భుతమైన రాజభవనాలు, అందమైన దేవాలయాలకు నిలయం. స్టార్ ఎయిర్ అనేది ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోడావత్ గ్రూప్ యొక్క విమానయాన విభాగం. ఈ గ్రూపు ఆగ్రో, ఏవియేషన్, మైనింగ్, రియాల్టీ, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, ఎనర్జీ, ఎడ్యుకేషన్, సాఫ్ట్‌వేర్ మరియు టెక్స్‌టైల్స్ రంగాలలో తన ఉనికిని కలిగి ఉంది. స్టార్ ఎయిర్ భారతదేశమంతటా షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ విమాన సేవలను అందిస్తుంది.