చూయింగ్ గమ్ బాగా నములుతున్నారా?

by sudharani |
చూయింగ్ గమ్ బాగా నములుతున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది చూయింగ్ గమ్‌ని నమలడానికి ఇష్టపడుతుంటారు. గంటల తరబడి నోట్లో వేసుకుని నములుతుంటారు. ఇక ఆటగాళ్లు గ్రౌండ్‌లో ఆటాడే సమయాల్లో చూయింగ్‌గమ్‌ని నమలడం చూస్తుంటాం. అయితే చూయింగ్‌గమ్‌ని నమలడం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం.

చూయింగ్‌గమ్‌ను నమలడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీంతో మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇది కూడా ఒక రకమైన వ్యాయామమే. అయితే మీరు తినే బబుల్‌గమ్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణలు తెలుపుతున్నారు. షుగర్ లెస్ చూయింగ్ గమ్ నమిలేవారిలో ఆహారం ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు.

ఏదైనా పని చేస్తున్న సమయంలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా.. ఆ పనిపై మరింత అప్రమత్తంగా ఉంటామని ఓ పరిశోధనలో తేలింది. దీనిని నమలడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు మనం చేసే పని మీద శ్రద్ద పెడతామని నిపుణులు చెబుతున్నారు. ఇక బబుల్ గమ్ నమలడం వల్ల దంత క్షయాన్ని నివారించవచ్చు. ఇది నోటి నుంచి వచ్చే దుర్వాసనను సైతం అరికడుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించడమే కాకుండా, ఒత్తిడి తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. దీనిని ఎక్కువగా నమలడం ద్వారా దవడ నొప్పి వస్తుంది. అలాగే దవడకు అనుసంధానంగా ఉండే కండరాల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed