- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లికల్ లిప్టు ఇరిగేషన్‌కు పరిపాలన అనుమతులు
దిశ, తెలంగాణ బ్యూరో : నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్లులో నిర్మించే లిప్టు ఇరిగేషన్ పనులకు ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 4175 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.7216 లక్షలతో లిప్టు పనులు చేపట్టనున్నారు. నెల్లికల్ గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముందుభాగంలో పంపింగ్ స్టేషన్ సరఫరా, మోటార్‌లతో నిలువు టర్బైన్ పంపులు, ఛానల్, ప్రెజర్ మెయిన్, డెలివరీ సిస్టెర్న్ మరియు గ్రావిటీ కెనాల్స్ మొదలైన పనుల కోసం రూ.691.40కోట్లతో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది.
అదే విధంగా అనుబంధ సివిల్‌తో ఎలక్ట్రో -మెకానికల్ పనుల నిర్మాణం, పరీక్షించడం మరియు ఆరంభించడం ఛానెల్, ప్రెజర్ మెయిన్, డెలివరీ సిస్టెర్న్, గ్రావిటీ కెనాల్స్ మొదలైనవాటి కోసం రూ. 664.80 కోట్లు ముందస్తు మూసివేతకు అనుమతితో మునుపటి పని ఈఎండీని ఏజెన్సీకి తిరిగి ఇవ్వడం, టెండర్‌ను పిలవడం కోసం ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.