‘మూడు గ్రామాలు… 12 వందల ఎకరాలు’

by Aamani |

దిశ, ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు భూముల్లో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బుధవారం నిర్వహించిన సర్వేలో పన్నెండు వందల పైచిలుకు ఎకరాల భూములను కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించారు. బాసర మండలంలోని మూడు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. బాసర, కిర్గుల్ కె, ఓని గ్రామాల్లో తాజాగా సర్వే చేపట్టారు. బాసరలో 738ఎకరాలు, కిర్గుల్ కె గ్రామశివారులో 140ఎకరాలు, ఓని శివార్లలో 296 ఎకరాలు కబ్జాలు గుర్తించి హద్దులు పాతారు. ఈ భూముల్లో ఎవరు ప్రవేశించినా కేసులు పెడతామని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు హెచ్చరించారు. ఇప్పటికే విక్రయాలను చేసిన వారిని గుర్తించి పట్టాలు రద్దు చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా క్రయవిక్రయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed