గూగుల్ లాంచ్ చేసిన ‘పీపుల్ కార్డ్స్’

by Harish |
గూగుల్ లాంచ్ చేసిన ‘పీపుల్ కార్డ్స్’
X

దిశ, వెబ్‌డెస్క్ :

సెలెబ్రిటీల ప్రొఫైల్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయడం చాలా ఈజీ. వాళ్ల పేరును ఇలా టైప్ చేయగానే.. అలా వారి డిటెయిల్స్ వచ్చేస్తుంటాయి. అయితే, ఇకపై సామాన్యుల ప్రొఫైల్స్‌ను సెర్చ్ చేయడం కూడా ఈజీ కాబోతుంది. ఇందుకోసం గూగుల్.. ‘పీపుల్స్ కార్స్డ్’ ఫీచర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. యూజర్ల ప్రొఫైల్స్‌పై ఇవి పాప్‌అప్‌ల రూపంలో కనిపిస్తుంటాయి.

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మెడికల్ రిప్రెజెంటేటివ్స్, ఫైనాన్సియల్ అడ్వయిజర్స్, డాక్టర్లు, సివిల్ ఇంజనీర్లు, లాయర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ప్రొఫెషనల్స్.. పరిచయస్తులను, కొత్తవాళ్లను, ఇతరులను కలిసినప్పుడు విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు. ఆ కార్డుల్లో తమకు సంబంధించిన పూర్తి డిటెయిల్స్ ఉంటాయి. గూగుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ‘పీపుల్ కార్డ్స్’ కూడా అచ్చంగా అలాంటివే. కాకపోతే.. వీటిని ‘వర్చువల్ విజిటింగ్ కార్డ్స్’‌గా చెప్పొచ్చు. ‘పీపుల్ కార్డ్స్’ను క్రియేట్ చేసుకోవాలనుకునే యూజర్లు.. వెబ్‌సైట్ నేమ్, సోషల్ ప్రొఫైల్స్, లొకేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ తదితర విషయాలను హైలైట్ చేసుకోవచ్చు. పబ్లిక్ తమ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ డిటెయిల్స్‌ను అందులో పొందుపరుచుకోవచ్చు.

ఇన్‌ప్లూయన్సర్స్, ఎంట్రప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కూడా వీటిని క్రియేట్ చేసుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఈ కార్డ్ డిటెయిల్స్ రాసుకోవచ్చు. కాగా, మరికొన్ని రోజుల్లో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానున్నాయని గూగుల్ వెల్లడించింది. వీటికి సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకున్నామని, వీటిని ఎప్పుడైనా డిలీట్ చేసుకునే అవకాశముందని తెలిపింది. కార్డ్స్‌పై ఫీడ్ బ్యాక్ బటన్ కూడా అందుబాటులో ఉంటుంది. కొన్ని కోట్ల మందిలో చాలా మంది పేర్లు ఒకేలా ఉండే చాన్స్ ఉంది కదా. మరి అప్పుడు ఎలాగ అంటారా? ఒకవేళ ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే.. లొకేషన్, ప్రొఫెషన్ ఆధారంగా వారి పేర్లను గుర్తుపడుతుంది.

కార్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి?

1. ముందుగా గూగుల్ అకౌంట్‌లో సైన్ ఇన్ కావాలి
2. ఆ తర్వాత గూగుల్ సెర్చ్‌లో మన పేరు టైప్ చేయాలి లేదా పేరు సెర్చ్ చేసి ‘యాడ్ మీ టూ సెర్చ్’ అని గూగుల్‌లో టైప్ చేయాలి.
3. ఆ తర్వాత కార్డు డిటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి.
4. ఇమేజ్ యాడ్ చేసుకుని, డిస్క్రిప్షన్ డిటెయిల్స్, వెబ్‌సైట్ లింక్స్, సోషల్ ప్రొఫైల్స్, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర విషయాలు యాడ్ చేసుకోవాలి.

Advertisement

Next Story