‘ది వైట్ టైగర్’ యాక్టర్‌కు అరుదైన ఘనత

by Shyam |
‘ది వైట్ టైగర్’ యాక్టర్‌కు అరుదైన ఘనత
X

దిశ, వెబ్‌డెస్క్: 2021 బ్రేక్ ఔట్ స్టార్ ఆదర్శ్ గౌరవ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరి కింద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. ‘ది వైట్ టైగర్‌’లో యాక్టింగ్‌గాను ఈ అవార్డుకు నామినేట్ అయిన గౌరవ్.. భారత్‌కు చెందిన నటుడు అందుకున్న అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటి. దీంతో ఈ మూమెంట్‌ను సెలెబ్రేట్ చేసుకోవాలంటున్నారు సెలెబ్రిటీలు. ఆదర్శ్‌ను చూస్తే గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి మూడు రోజులకు ముందుగా అంటే ఏప్రిల్ 22న 36వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. జనవరి 26న నామినేషన్లను ప్రకటించారు. ఇందులో చైతన్య తమ్హానే డైరెక్షన్‌లో వచ్చిన ‘ది డిసిపుల్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయింది.

ఓ చిన్న గ్రామానికి చెందిన నిరుపేద నుంచి ఆధునిక భారతదేశంలో విజయవంతమైన వ్యవస్థాపకుడిగా ఎదిగిన బలరామ్ హల్వాయి(ఆదర్ష్ గౌరవ్) కథే ‘ది వైట్ టైగర్’. అమెరికా నుండి తిరిగి వచ్చిన అశోక్ (రాజ్ కుమార్ రావు), పింకీ (ప్రియాంక చోప్రా)కు డ్రైవర్‌గా ఉన్న బలరామ్..వారిద్దరు చేసిన ఓ క్రైమ్ గురించి తెలుసుకోగా.. డ్రైవర్‌ను వలలో వేసుకునేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఇద్దరు దంపతులు ఏం చేశారు?. ఈ ఘటనల నుంచి రియలైజ్ అయిన బలరామ్.. అన్నిటినీ కోల్పోయే సమయంలో కఠినమైన, అసమాన వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి.. మాస్టర్‌గా ఎలా ఎదిగాడు? అనేది స్టోరి.

Advertisement

Next Story

Most Viewed