- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిష్ణపట్నం పోర్టు అదానీ పరం
అహ్మదాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణపట్నం పోర్టులోవాటాలను అదానీ గ్రూపు 75శాతం నుంచి 100 శాతానికి పెంచుకుంది. భారత్‌లోని అతిపెద్ద ప్రైవేటు పోర్టులు, లాజిస్టిక్స్ కంపెనీ అదానీ పోర్ట్స్ క్రిష్ణపట్నం పోర్టులో విశ్వసముద్ర హోల్డింగ్‌కు గల 25శాతం వాటాను రూ. 2800 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ పోర్టులో 100 శాతం వాటాలను అదానీ పోర్ట్స్ సొంతం చేసుకున్నట్టయింది. గత నెల గంగవరం పోర్టులోనూ వాటాలను 89.6 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. డీవీఎస్ రాజు కుటుంబం నుంచి రూ. 3604 కోట్లతో ఈ స్టేక్‌ను పెంచుకుంది.
తాజాగా, క్రిష్ణపట్నం పోర్టు పూర్తిగా సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలోని ఈ పోర్టు అన్ని సీజన్‌లలోనూ పనిచేస్తుందని అదానీ తెలిపింది. ప్రస్తుతం ఏడాదికి 64 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని, దీన్ని 300 ఎంఎంటీపీఏకు పెంచే మాస్టర్ ప్లాన్ ఉన్నదని వివరించింది. తూర్పు, పశ్చిమ భారతంలో పోర్టుల వ్యాపారంలో విస్తరించాలనే లక్ష్యానికి మరింత చేరువయ్యామని, 2025 వరకు 500 ఎంఎంటీ తమ టార్గెట్ అని ప్రకటనలో అదానీ గ్రూప్ పేర్కొంది.