ఇందిరా పార్క్‌లోకి ఈడ్చుకొని వెళ్లాడంటూ నటి స్నిగ్ధ ఎమోష‌న‌ల్..?

by Shyam |
Actress Snigdha
X

దిశ, సినిమా: అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో పాపులర్ అయిన న‌టి స్నిగ్ధ. ఆమె పేరు చెప్పగానే అబ్బాయిలా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్‌తో వేషధారణ గుర్తుకు వస్తుంది. 2011లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆమె ఈ చిత్రంలో పింకీ పాత్రలో.. నాని, నిత్యా మీనన్లకు స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాలో అబ్బాయి లుక్లో కనిపించిన స్నిగ్ధ కామెడీని పండించింది. తర్వాత ఆమె మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దమ్ము చిత్రాలలో నటించింది. ఎంతో చలాకీగా.. నవ్వుకుంటూ కనిపించే స్నిగ్ధ జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని తాజాగా జీ తెలుగులో ప్రసారం అయ్యే సూపర్ క్వీన్ ప్రోమోలో ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు.

తాజాగా.. తాను సూపర్ క్వీన్ అనే షోలో పాల్గొనింది. ఇందులో తన గతం గురించి చెప్పి అందరినీ ఎమోషనల్ చేసింది. చిన్నతనంలో పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఓ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. తాను స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో తన తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ పంపించేవాడని చెప్పారు. ఎవరి వద్దకు వెళ్లకుండా.. వెళ్లిన దారిలోనే మళ్లీ తిరిగి రావాలని జగ్రత్తలు చెప్పేవారని తెలిపింది. అయితే ఓ రోజు ఇందిరా పార్క్‌లో ఆడుకోవడానికి వెళ్తుంటే.. తనను ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్ళాడని చెబుతూ కంటతడి పెట్టింది. ఈ ఘటన విన్న అక్కడ మహిళా సెలబ్రిటీలందరూ కంటతడి పెట్టారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story