- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ హీరోయిన్ మృతి
దిశ, వెబ్‌డెస్క్: ప్రమఖ సినీ నటి జయంతి(76) కన్నుమూశారు. గత 35 సంవత్సరాలుగా అస్తమా సమస్యతో ఆమె బాధపడుతుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల బెంగళూరు విక్రమ్ ఆస్పత్రిలో శ్వాసకోస సమస్యకు చికిత్స పొంది అనంతరం తిరిగి ఇంటికొచ్చారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీలలో దాదాపు 500కిపైగా సినిమాల్లో జయంతి నటించారు. 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 1968లో కన్నడలో ‘జైంగూడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఆమె అడుగుగుపెట్టారు.
ఎన్టీఆర్, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్, రాజ్‌కుమార్ వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించారు. భార్య భర్తలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి జయంతి అడుగుపెట్టారు. జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి, కొండవీటి సింహం, బొబ్బిలియుద్దం వంటి సినిమాల్లో జయంతి నటించారు.