- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సుగా మారిన యాక్టర్.. కరోనా రోగులకు వైద్య సేవ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం… షేక్ హ్యాండ్‌కు నో చెప్పింది. ప్రేమగా హగ్ చేసుకుందామన్నసరే… సోషల్ డిస్టెన్స్ అంటూ ఆప్తులను సైతం దూరం పెట్టేలా చేసింది. కేవలం నమస్కారమే సంస్కారమని మేల్కొలిపింది. ఇంట్లో కుటుంబీకుల చేతులు పట్టుకుందామన్నా భయపడేలా చేసింది. కానీ… వైద్య సిబ్బందికి ఇలాంటి విషయాల గురించి ఆలోచించే టైం లేదు. ప్రజల ప్రాణాలను నిలబెట్టేందుకు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కానీ సినీ ప్రముఖులు అలా కాదు. దేశానికి విపత్తు వచ్చిందంటే… ఎంతో కొంత విరాళం అందించి హెల్ప్ చేస్తుంటారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వైద్య వాలంటీర్లు అవసరముంది. దేశ ప్రజల ప్రాణాలు రక్షించుకునేందుకు వైద్యం తెలిసిన ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
ఈ సమయంలో ఓ సినీ నటి తన స్టేటస్‌ను పక్కన పెట్టి నర్సుగా పనిచేస్తోంది. రోగులకు నేరుగా సేవలు అందిస్తోంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘ఫ్యాన్’ సినిమాలో నటించిన శిఖా మల్హోత్రా ముంబైలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ 19 రోగులకు వైద్య సేవలు చేస్తోంది. ఢిల్లీ మహావీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చేసిన శిఖ… అనుకోకుండా సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ అయింది. అయితే దేశానికి తనకు తెలసిన విద్య అవసరమైనప్పుడు సెలబ్రిటీలాగే ఇంటికే ఎలా పరిమితం అవ్వగలను అని చెప్తోంది. మీలో కూడా వైద్యం తెలిసిన వారు ఉంటే వాలంటీర్లుగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని కోరుతోంది.
Tags: Shikha Malhotra, Bollywood, CoronaVirus, Covid19