- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి హీరో నారా రోహిత్ మద్దతు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు ప్రకటిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, మంచు మనోజ్, శివాజీ, ఆర్పీ పట్నాయక్, కోన వెంకట్ లు మద్దతు ప్రకటించారు. తాజాగా నటుడు నారా రోహిత్ సైతం తన మద్దతు ప్రకటించారు. నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలని పిలుపునిచ్చారు. ఫేస్ బుక్ వేదికగా నారా రోహిత్ తన మద్దతు ప్రకటించారు. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ అన్నారు.
ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి అని అభిప్రాయపడ్డారు. ఉక్కు పోరాటంలో తననూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనమన్నారు. తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం తన నైజం కాదని, సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోందని, యువతా.. మేలుకో అంటూ పలు సూచనలు చేశారు. యువత తన పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకాలన్నారు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే విశాఖకు వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతానని నటుడు రోహిత్ ప్రకటించారు.