దీపాలతో కరోనాను తరిమికొడదాం : కృష్ణంరాజు

by Shyam |   ( Updated:2020-04-04 23:03:00.0  )
దీపాలతో కరోనాను తరిమికొడదాం : కృష్ణంరాజు
X

కరోనా కారణంగా అలుముకున్న చీకట్లను దీపాల వెలుగుతో తరిమికొడదామని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలను వెలిగించాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపునకు సంఘీభావం తెలుపుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మనమంతా కలసికట్టుగా పోరాడితే కరోనాను దేశం నుంచి వెళ్లగొట్టగలమని ఆ వీడియోలో తెలిపారు.

Tags: Actor Krishnam Raju, solidarity, pm Modi, lights, april 5th, night 9pm

Advertisement

Next Story