బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏసీపీ క్లారిటీ..

by Anukaran |   ( Updated:2021-03-23 01:52:34.0  )
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏసీపీ క్లారిటీ..
X

దిశ,వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలో చంద్రిక అనే విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న చంద్రిక హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మిర్యాల గూడకు చెందిన చంద్రిక మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యనే హాస్టల్ కి వచ్చిన చంద్రిక చదువు మీద దృష్టి పెట్టలేకపోయింది. ఈ కారణంగానే ఆమెకు బ్యాక్ లాగ్స్ ఎక్కువయ్యాయి. దీంతో సరిగ్గా చదవలేకపోతున్నానే మనస్తాపంతో చంద్రిక ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed