- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్ ఇన్ ఇండియా: హ్యాపీ బర్త్‌డే ‘మాస్టర్ బ్లాస్టర్’
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ చరిత్రలో అతడో సంచలనం.. ఎన్నో మ్యాచులు ఆడిన ఆ ఓపెనర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్రీజులోకి దిగి పరుగుల వరద పారిస్తూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేశాడు. ఇంతకీ అతడు ఎవరో కాదు.. టీమిండియా మాజీ ఆటగాడు, లెజెండరీ క్రికెటర్ సచిన్ రమేష్ టెండుల్కర్. ఈ రోజు సచిన్ టెండుల్కర్ పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. అందుకే సోషల్ మీడియాలో ‘మాస్టర్ బ్లాస్టర్’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తమ అభిమాన క్రికెటర్‌కు నెటిజన్లు శుభాకాంక్షలతో వెల్లువెత్తారు. ఇంతగా అభిమానులకు దగ్గరైన సచిన్ 1948, ఏప్రిల్ 24న బాంబే(ముంబై)లో జన్మించాడు.
సచిన్ కెరీర్ రికార్డ్స్..
తన క్రికెట్ చరిత్రలో టీమిండియా తరఫున సచిన్ కొన్ని వందల మ్యాచులు ఆడాడు. మొత్తం 200 టెస్టు మ్యాచులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 15,921 వ్యక్తిగత పరుగులు నమోదు చేయగా.. ఇందులో అత్యధిక స్కోరు 248 ఉండటం విశేషం. టెస్టు సిరీస్‌లల్లో 6 డబుల్ సెంచరీలు, 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 463 వన్డే మ్యాచుల్లో 18,426 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 200 చేశాడు. ఇక వన్డే మ్యాచుల్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా 1 డబుల్ సెంచరీ, 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచులు ఆడగా.. 2,334 పరుగులు, అత్యధిక స్కోరు 100, 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇలా ఆడిన ప్రతి సిరీస్‌లల్లో సచిన్ టెండుల్కర్ తనదైన ముద్ర వేసి ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే 100 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా సచిన్ రికార్డులు బ్రేక్ చేయడం విశేషం.
ఎన్నో అవార్డులు..
భారత్ తరఫున ఎన్నో మ్యాచుల్లో కీలక పాత్ర పోషించిన సచిన్ టెండుల్కర్‌కు ఎన్నో అవార్డులు వరించాయి.
1994.. అర్డున అవార్డు
1997.. విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
1997/98.. రాజీవ్ ఖేల్ రత్న
1999.. పద్మ శ్రీ
2001.. మహారాష్ట్ర భూషన్ అవార్డు
2008.. పద్మ విభూషన్
2010.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
2010.. ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డు
2014.. భారత్ రత్న
2019.. అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా అంబాసిడర్
2020.. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు.. ఇలా సచిన్ టెండుల్కర్ తన జీవిత కాలంలో ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ రిటైర్‌మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్(లెజెండరీ క్రికెట్)లో కూడా రాణిస్తున్నాడు.